సాక్షి, చైన్నె : దక్షిణ రైల్వే జీఎం ఆర్.ఎన్. సింగ్ రచించిన ‘బియాండ్ ది ఐవీ లీగ్ : ట్రెయిట్స్, స్కిల్స్ అండ్ విజ్ డమ్ దట్ మేక్ గ్రేట్ లీడర్స్ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. చైన్నె పెరంబూరులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సైమన్ – షుస్టర్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, రిటైర్డ్ డీజీపీలు రవి, శంకర్ జీవ, రైల్వేబోర్డు సభ్యుడు నవీన్ గుల్లాటి, ఐసీఎఫ్ జీఎం సుబ్బారావులు అందుకున్నారు. భారతీయ రైల్వేలో మూడు దశాబ్దాలకు పైగా విభిన్న హోదాల్లో పనిచేసిన అనుభవంతో ఆర్.ఎన్. సింగ్ ఈ పుస్తకాన్ని రూపొందించారు.


