చైన్నెలో వృద్ధుల సంరక్షణ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో వృద్ధుల సంరక్షణ కేంద్రం

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

చైన్నెలో వృద్ధుల సంరక్షణ కేంద్రం

సాక్షి, చైన్నె: వైద్య సహాయం, పునరావాసం, ఆతిథ్యాన్ని సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో వృద్ధుల సంరక్షణ కేంద్రంగా చైన్నెలో ప్రీమి యం సీనియర్‌ కేర్‌ సెంటర్‌ ఓరా సీనియర్‌ కేర్‌ ఆవిష్కృతమైంది. దీనిని బుధవారం అటవీ శాఖమంత్రి ఆర్‌వి రంజిత్‌కుమార్‌ ప్రారంభించారు. చైన్నె వేప్పేరిలో మహిళా పారిశ్రామిక వేత్త ఛవి సురానా దీనిని స్థాపించారు. వృద్ధాప్యంలో ప్రశాంతత, గౌరవం, ఆత్మీయమైన వాతావరణం, నాణ్యమైన వైద్య సంరక్షణ ఒకే చోట అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అసిస్టెడ్‌ లివింగ్‌, ట్రాన్సిషనల్‌ కేర్‌ – ఆసుపత్రి డిశ్చార్జ్‌ తర్వాత సంరక్షణ, రీహ్యాబిలిటేషన్‌ (పునరావాస వైద్యం), దీర్ఘకాలిక వైద్య సంరక్షణ, 24 గంటల పర్యవేక్షణ, వైద్య సిబ్బంది లభ్యత వంటి సేవలను ఇక్కడ ఏర్పాటు చేశామని ఛవి సురాన ఈసందర్భంగా వివరించారు.వృత్తిపరమైన వైద్య సంరక్షణ కావాలా లేక కుటుంబానికి దగ్గరగా ఉండాలా అనే అయోమయంతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటాయని, ఆ రెండింటినీ ఒకే చోట అందిస్తూ, సీనియర్‌ సిటిజన్లను కేవలం రోగులుగా కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆత్మీయ వాతావరణంలో చూసుకోవడమే ఓరా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైన్నెకి చెందిన ప్రముఖ వైద్యులు, సమాజ ప్రముఖులు పాల్గొని ఫెసిలిటీని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి రంజిత్‌కుమార్‌ వైద్యులను, ఇక్కడ సేవలు అందించేందుకు ఎంపికై న వారిని సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement