అపోలోలో రోబోటిక్‌ కేన్సర్‌ శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

అపోలోలో రోబోటిక్‌ కేన్సర్‌ శస్త్రచికిత్స

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

కొరుక్కుపేట : రోబోటిక్‌–సహాయక క్యాన్సర్‌ సంరక్షణలో అగ్రగామి అయిన చైన్నెలోని అపోలో హాస్పిటల్స్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో ఎండోస్కోపిక్‌ ఇంగ్వైనల్‌ లింఫాడెనెక్టమీ (వెయిల్‌)ని విజయవంతంగా నిర్వహించినట్టు ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ – యూరాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎన్‌ రాఘవన్‌ తెలిపారు.ఈ మేరకు స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో రోబోటిక్‌ సహాయంతో పురుషాంగ క్యాన్సర్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల రోగికి శస్త్రచికిత్స ను విజయవంతంగా చేశామని , అనంతరం ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా అద్భుతంగా కోలుకున్నారని అన్నారు. ఈ శస్త్రచికిత్సను హ్యూగో రోబోటిక్‌–అసిస్టెడ్‌ సర్జరీ (రాస్‌) సిస్టమ్‌ను ఉపయోగించి, తొడ మధ్యభాగం నుండి కాకుండా పక్కభాగం నుండి గజ్జలోని శోషరస కణుపులను చేరుకునే ఒక కనిష్ట కోత పద్ధతి అయిన లాటరల్‌ అప్రోచ్‌ ద్వారా నిర్వహించామన్నారు. అపోలో హాస్పిటల్స్‌, చైన్నె రీజియన్‌ సీఈఓ డాక్టర్‌ ఇలంకుమారన్‌ కళియమూర్తి, చైన్నె తేనంపేట అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ మాధవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement