తమిళసినిమా: దర్శకుడు శంకర్. ఈ పేరు భారీ, బ్రహ్మాండ చిత్రాలకు చిరునామా. తొలి చిత్రం జెంటిల్‌మెన్‌తోనే ప్రేక్షకుల చేత వావ్ అనిపించిన ఈయన ఆ తరువాత ముదల్వన్, బాయ్స్, శివాజీ, ఇండియన్, ఎందిరన్ ఇలా పలు బ్రహ్మాండ చిత్రాలకు సృష్టి కర్తగా మారారు. ఎంతపెద్ద దర్శకుడికై నా జయాపజయాలు సహజం. అలా ఇటీవల శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్–2 చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో తగిన సమయాన్ని తీసుకుని మళ్లీ బ్రహ్మాండంగా చారిత్రక కథా చిత్రంతో రావడానికి సిద్ధమవుతున్నారు. వేల్పారి అనే ప్రసిద్ధి చెందిన నవల ఆధారంగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయకుడి సూర్య పర్ఫెక్ట్‌గా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ఆ మధ్య దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇది తాను డ్రీమ్ చిత్రం అని కూడా చెప్పారు. అలాంటి చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆయన టీమ్ ముమ్మరంగా ఉందని, అయితే ముందు నిర్మాణ పనులకే ఏడాదికి పైగా సమయం పెట్టనున్నట్లు సమాచారు. ఈ చిత్రానికి ముందు ఒక యువ హీరోతో ఫుల్ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ చిత్రం చేయాలని శంకర్ నిర్ణయించుకున్నట్లు తాజాసమాచారం. ఈ చిత్రంలో నటించడానికి ఇద్దరు యువహీరోలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి తను డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారీ చిత్రానికి రెడీ అవుతారని సమాచారం.
శంకర్


