క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

జారి పడి ప్రైవేట్‌ ఉద్యోగి మృతి

అన్నానగర్‌: కన్యాకుమారి జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్‌ (30)తిరువళ్లూరు సమీపంలో ని మేల్‌ నల్లత్తూరులో ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఆఫీస్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం, ఇతను ఎరై యాయమంగళం గ్రామంలో ఉంటు పని చేస్తు వచ్చాడు. ఈ స్థితిలో, ఆదివారం ఉదయం పని ముగించుకున్న తర్వాత, అతను సుమారు 5.40 గంటలకు తన ద్విచక్ర వాహ నంపై ఎరై యాయమంగళంలోని తన ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో, మనవాళనగర్‌ వర్క్‌షాప్‌ సమీపానికి వెళ్తుండగా అతను కాలు జారి కిందపడిపోయాడు. అతని దవడకు దెబ్బ తగలడంతో తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అక్కడ ఎలాంటి చికిత్స ఫలించక అరుణ్‌ కుమార్‌ మరణించాడు. మనవాళ నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా

కొరుక్కుపేట: చైన్నె నగర శివారుప్రాంతమైన పట్టాభిరామ్‌లో ఉన్న ధర్మమూర్తి రావు బహదూర్‌ కలవల కన్నన్‌ చెట్టి హిందూ కళాశాల(డీఆర్‌బీసీసీసీ)కు ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. ఈ విషయాన్ని కళాశాల నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తద్వారా కళాశాల స్వతంత్రంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను తయారు చేయవచ్చు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు పరీక్షల ఫలితాలు త్వరగా విడుదలవుతాయి. డిగ్రీలను మద్రాసు విశ్వవిద్యాలయం ఆమోదించి మంజూరు చేస్తుంది. డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సులు తదితర వివిధ విద్యా కార్యక్రమా లను ప్రవేశపెట్టే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచడానికి తోడ్పడుతుంది. ౖ కళాశాలకు తెలుగు మైనా దిటీ హోదా ఉన్నందున తెలుగు విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇక్కడ చేరితే అనేక అవకాశాలుంటాయని , బీఏ తెలుగు కోర్సు చదివితే ఉద్యో గావకాశాలను కల్పించే దిశగా కొన్ని మార్పు లు, సాంకేతికతతో కూడిన సబ్జెక్ట్‌లను ప్రవేశపెడతామని ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి వెంకటేశ పెరుమాళ్‌, డైరెక్టరు డాక్టర్‌ ఎన్‌. రాజేంద్ర నాయుడు, ప్రధాన అధ్యాపకులు డాక్టర్‌ జి. కల్విక్కరసి పేర్కొన్నారు.

బైక్‌ను ఢీకొన్న లారీ

– దంపతుల దుర్మరణం

అన్నానగర్‌: బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో గర్భిణి అయిన భార్య, భర్త దుర్మరణం చెందారు. కడలూరు జిల్లాలోని దిట్టకుడి సమీపంలో ఉన్న ఇడైచెరువాయి గ్రామానికి చెందిన జయరామన్‌ కుమారుడు తిరుమల్‌ (33). ఇతను పెరంబలూరు జిల్లాలోని డామ్‌ వి.కలత్తూరు పోలీస్‌స్టేషన్‌న్‌లో కానిస్టేబుల్‌. ప్రస్తుతం ఇతను పెరంబలూరు ఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రమ్య (27). ఈమె ఆరు నెలల గర్భవతి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ పరిస్థితిలో రమ్య వైద్య పరీక్ష కోసం బైకులో దంపతులు ఇద్దరు విరుదాచలం వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని శనివారం రాత్రి పట్టణానికి తిరిగి బయలుదేరా రు. దిట్టకుడి సమీపం పట్టూరు వద్ద వెళుతుండగా లారీ బైకును ఢీకొంది. ప్రమాదంలో తిరుమల్‌ , రమ్య ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందా రు. పోలిసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

తిరువళ్లూరు: బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తిరువూరు గ్రామం జగజ్జీవన్‌రామ్‌ వీఽధికి చెందిన డానియల్‌బాబు(55). ఇతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ క్రమంలో తిరువూరు నుంచి తిరువళ్లూరులోని మార్కెట్‌ కు కూరగాయలు కొనుగోలు చేయడానికి బైక్‌ లో బయలుదేరాడు. పట్టణంలోని సీవీ నాయు డు రోడ్డులో వెళుతుండగా వెనుక నుంచి వచ్చి న టిప్పర్‌ బైక్‌ను డీకొంది. ఈ ప్రమాదంలో డానియల్‌బాబు సంఘటన స్థలంలో మృతిచెందాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు మెడికల్‌ కళాశాలకు తరలించి అక్కడ పంచనామ నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రౌడీ హత్య కేసులో

ఆరుగురు అరెస్ట్‌

తిరువొత్తియూరు: పుదుచ్చేరి సమీపంలోని మాంబాక్కంకు చెందిన పుగలేంది అనే రౌడీ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పుగలేందిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం వంటి పలు కేసులు ఉన్నాయి. ఆయనకు, అదే ప్రాంతానికి చెందిన జార్జ్‌ ఫెర్నాండెజ్‌ అతని వర్గానికి మధ్య ఎవరు పెద్ద రౌడీ అనే విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పుగలేంది తన స్నేహితుడు జయరాజ్‌తో కలిసి మోటార్‌ సైకిల్‌పై తిరువణ్ణామలై నుంచి తిరిగి వస్తుండగా, జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ముఠా కారుతో వారిని ఢీకొట్టింది. కింద పడిపోయిన పుగ లేందిని ఆ ముఠా కత్తులతో అతి దారుణంగా నరికి హత్య చేశారు కాగా ఓ సరస్సు సమీపంలో దాగి ఉన్న ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వారిలో జార్జ్‌ ఫెర్నాండెజ్‌ (24), రాజీ (33), దిలీప్‌ (25), అరవిందన్‌ (22), నరేష్‌ కుమార్‌ (21), అభిషేక్‌ (19) ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement