మా కల నెరవేరింది..! | - | Sakshi
Sakshi News home page

మా కల నెరవేరింది..!

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

తమిళసినిమా: బహుభాషా నటీమణుల్లో మేఘనరాజ్‌ ఒకరు. ఈ కన్నడ భామ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో కాదల్‌ సొల్ల వందేన్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. కన్నడ నటుడు, అర్జున్‌కు బంధువు అయిన నటుడు చిరంజీవి సార్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరి పెళ్లి జరిగింది. కాగా అనూహ్యంగా చిరంజీవి సార్జా గత 2020లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన బ్రతికి ఉండగానే నటి మేఘనరాజ్‌ గర్బం దాల్చారు. పెళ్లి అయిన తరువాత నటనకు దూరంగా ఉన్న మేఘనరాజ్‌ మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా చాలా గ్యాప్‌ తరువాత ఈమె మళ్లీ నటించడానికి సిద్దం అయ్యారు.అలా తమిళంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన జైలర్‌– 2 చిత్రంలో మేఘనరాజ్‌ కీలక పాత్రను పోషించినట్లు ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేసే విధంగా ఆ చిత్ర షూటింగ్‌లో ఆమె తన బిడ్డతో కలిసి నటుడు రజనీకాంత్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందులో నా భర్త చిరంజీవి సార్జా నటుడు రజనీకాంత్‌కు వీరాభిమాని. ఆయనతో కలిసి నటించాలన్నది మా చిరకాల కల. ఈ ఏడాది మా 8వ వివాహ వార్షికోత్సవం. ఇప్పుడు మా చిరకాల కల నెరవేరింది. ఇది నా సినీ జీవితంలో మైలు రాయి. అది మీ వల్లే సాధ్యం అయ్యింది ( భర్తను ఉద్దేశించి). అని నటి మేఘనరాజ్‌ ఉద్వేగంగా పేర్కొన్నారు. దీంతో జైలర్‌ 2 చిత్రంలో ఈమె పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement