వేలూరు: వేలూరు జిల్లాలోని ఐదు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. వేలూరు జిల్లాలోని వేలూరు, అనకట్టు, కాట్పాడి, కేవీ కుప్పం, గుడియాత్తం అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వేలూరు తందైపెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. అదేవిధంగా ఈనెల 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి నేరుగా పరిశీలించి వసతులపై సంబంధిత అధికారుల వద్ద ఆరా తీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ ఏజెంట్లుగా నియమించరాదన్నారు. గుర్తింపు కార్డును చూపించి లోనికి వెళ్లే విధంగా చూడాలన్నారు. గుర్తింపు కార్డు లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దన్నారు.


