కామెడీగా పరిమళ అండ్‌ కో | - | Sakshi
Sakshi News home page

కామెడీగా పరిమళ అండ్‌ కో

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

తమిళసినిమా: ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్‌ తాజాగా కామెడీ, డ్రామా నేపథ్యంలో చిత్రం చేయడం విశేషం. ఈ చిత్రానికి పపరిమళ అండ్‌ కో అనే టైటిల్‌ నిర్ణయించారు. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తలైవన్‌ తలైవి చిత్రం తర్వాత పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దీన్ని లైట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌న్స్‌ అధినేత సుభాష్కరన్‌, తమిళ్‌ కుమరన్‌ ప్రొడక్షన్‌న్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత తమిళ్‌కుమరన్‌, పసంగ ప్రొడక్షన్‌న్స్‌ అధినేత పాండిరాజ్‌ కలిసి నిర్మించడం విశేషం. పాండిరాజ్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించగా సంతోష్‌ శోభన్‌ కీలకపాత్రను పోషించారు . ఆయనకు జంటగా సంజనాకష్ణమూర్తి నటించగా, మరో జంటగా చండీ, ఆనందిక నటించారు. దర్శకుడు మిష్కిన్‌ వైవిధ్య విభిన్నమైన పాత్రలో పోషించారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మేడే సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. చైన్నె, కోయంబత్తూర్‌ నుంచి పాలక్కాడు వరకు పయనించే థ్రిల్లర్‌ కామెడీ కథా చిత్రంగా పరిమళ అండ్‌ కో ఉంటుందన్నారు. త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

పరిమళ

అండ్‌ కో

ఫస్ట్‌లుక్‌

పోస్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement