కొరుక్కుపేట: ఆభరణాల విక్రయరంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంటున్న జి.ఆర్.టి. జ్యువెలర్స్, తమ కడలూరు షోరూమ్‌ను ఇంపీరియల్ రోడ్‌లోని మరింత పెద్ద, వైభవమైన ,అధునికమైన షోరూమ్‌కు తరలించినట్టు జి.ఆర్.టి. జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఆర్. ఆనంద్ అనంతపద్మనాభన్ తెలిపారు . ఈ ఘన ప్రారంభోత్సవం కడలూరులోని ఆభరణ ప్రియులకు ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు .ఈ కొత్త ఆరంభాన్ని పురస్కరించుకుని, జీఆర్‌టీ జ్యువెలర్స్ తమ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు రూ.250 తగ్గింపు, పాత బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రూ. 100 అదనంగా, సోలిటైర్లు మినహా వజ్రాలు, కట్ చేయని వజ్రాల విలువపై 12.5శాతం తగ్గింపు, వెండి వస్తువులపై వేస్టేజ్ (విఏ) పై 25శాతం తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్‌పి పై 10 శాతం తగ్గింపును పొందవచ్చని ,ఈ ప్రత్యేక ప్రయోజనాలు వినియోగదారులకు కొత్త షోరూమ్‌కు మారడాన్ని మరింత లాభదాయకంగా చేస్తాయని జి.ఆర్.టి. జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఆర్. ఆనంద్ అనంతపద్మనాభన్ తెలిపారు.


