రిలీజ్‌ కాకముందే అవార్డు | - | Sakshi
Sakshi News home page

రిలీజ్‌ కాకముందే అవార్డు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

రిలీజ్‌ కాకముందే అవార్డు

తమిళసినిమా: కొన్ని చిత్రాలు థియేటర్లోకి రాకముందే ప్రపంచస్థాయిలో గుర్తింపును పొందుతాయి. అలాంటి వాటిలో తాజాగా చోటు సంపాదించుకున్న చిత్రం ఎన్నవిలై. అవును ఈ చిత్రం గత ఏప్రిల్‌ 30వ తేదీన ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో తమిళ చిత్రాల కేటగిరీలో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకుంది. దీని గురించి చిత్ర దర్శక నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కళామయ ఫిలిమ్స్‌ పతాకంపై కేథేష్‌.వి నిర్మించిన ఈ చిత్రానికి సజీవ్‌ పళూర్‌ దర్శకత్వం వహించారు. కరుణాస్‌, నిమీషా సజయన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో వైజీ మహేంద్రన్‌, పూర్ణిమాభాగ్యరాజ్‌, మోహన్‌రామ్‌, సొల్లుసభ స్వామినాథన్‌, దీపా శంకర్‌, మొట్టై రాజేంద్రన్‌, నక్సలైట్లు కవి ముఖ్యపాత్రలు పోషించారు. అవార్డులకు రివార్డుల మధ్య దూరాన్ని తగ్గించే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం ఎన్న విలై. ఈ చిత్రం విడుదలకు ముందే దాదా సాహెబ్‌ ఫాల్కే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకోవడం గర్వంగా ఉంది. సామాజిక రాజకీయ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్ర షూటింగ్‌ను 56 ప్రదేశాల్లో నిర్వహించాం. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement