సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని చైన్నె అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజీలో ఎయిర్‌ఏషియా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను తొలిసారిగా నిర్వహించిందని ఆ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మెన్ భూమినాథన్ తెలిపారు. ఈ విషయంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తొలిసారిగా, ఎయిర్‌ఏషి యా చైన్నెలోని అమృతలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించి, చైన్నెలో విమానయాన పరిశ్రమ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని నెలకొల్పిందన్నారు. ఆసియాలోని ప్రముఖ విమానయాన సంస్థలలో ఒకటైన ఎయిర్‌ఏషియా సంస్థ విద్యార్థులకు నేరుగా ఉద్యోగ అవకాశాలను అందిస్తుందన్నారు. విమానయాన, ఆతిథ్య విద్యారంగంలో నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, చైన్నెకి చెందిన అమృత 31,651 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిందన్నారు. కార్యక్రమంలో, కౌలాలంపూర్‌లోని ఎయిర్‌ఏషియా రెడ్‌క్యూ, ఏఓసి లైన్ మెయింటెనెనన్స్ విభాగాధిపతి శరవణన్ రాజ్ మునుస్వామి , విద్యార్థులతో సంభాషించి, విమానయాన వృత్తులు, కార్యాచరణ నైపుణ్యం, ఎయిర్‌ఏషియాలోని అంతర్జాతీయ అవకాశాలపై అవగాహన పెంచారు. క్యాంపస్ డ్రైవ్‌లో ఎంపికై న అభ్యర్థులు ఎయిర్‌ఏషియాలో 6 నెలల ఇంటర్న్‌షిప్ తో పనితీరు ఆధారంగా తక్షణ ఉద్యోగ అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైన్నె అమృత ఛైర్మెన్ భూమినాథన్ సమక్షంలో మలేషియా మాజీ మంత్రి, పెరాక్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ డాటో సెరి డాక్టర్. ఎస్.కె. దేవమణి చేతులమీదుగా చైన్నె అమృతలో కొత్త ఆడిటోరియాన్ని ప్రారంభించారు.


