సాక్షి, చైన్నె: అధికారం తమదే, విజయ్ సీఎం కావడం తథ్యమని ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించిన యాక్సిస్ మై ఇండియా గత అంచనాలు నిజమయ్యాయా అనే కోణంలో టీవీకే వర్గాలు అన్వేషణలో నిమగ్నమ్యాయి. మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకే కూటమికే మళ్లీ పట్టం అని ప్రకటిస్తే, యాక్సిస్‌మై ఇండియా మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు స్పష్టమైన విజయ అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా లేదా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి?, ఏయే ఎన్నికల్లో వీరి అంచనాలు తప్పాయో అనే అంశంపై టీవీకే వర్గాలు సమీక్షించే పనిలో నిమగ్నం కావడం విశేషం.
విజయ్


