కొరుక్కుపేట: చైన్నె ప్యారిస్ గిడ్డంగి వీధిలోని సదరన్ ఇండియా వైశ్య అసోసియేషన్ 122వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా శుక్రవారం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు అజంతా డాక్టర్ కె. శంకర రావు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్జన్ కంపెనీ అధినేత బి.గౌతమ్ పాల్గొని అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. శంకర రావు మాట్లాడుతూ సంఘానికి సొంత భవన నిర్మాణం పూర్తిచేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం అధ్యక్షుఉ డా.ఎస్ జి సూర్య, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసల రమేష్, ఉపాధ్యక్షులు మన్నారు ఉదయ్‌కుమార్, ఎం. కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.


