నాగత్తమ్మన్‌ ఆలయంలో పాలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

నాగత్తమ్మన్‌ ఆలయంలో పాలాభిషేకం

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

తిరువళ్లూరు: చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని నాగత్తమ్మన్‌ ఆలయంలో పాలాభిషేకం శుక్రవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్‌ కన్నిగైపేర్‌ ప్రాంతంలో నాగత్తమ్మన్‌ ఆలయం ఉంది. ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు 2024వ సంవత్సరంలో పునఃనిర్మించి కుంభాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి రోజున పాలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోభాగంగానే శుక్రవారం చైత్ర పౌర్ణమి కావడంతో పాలాభిషేకం నిర్వహించారు. వంద మంది భక్తులు పాలతో వచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం రాత్రి అమ్మవారికి ప్రత్యేక అలంకరించి ఊరేగింపు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement