బ్రౌన్‌మణి
ఫస్ట్‌లుక్ విడుదల
తమిళసినిమా: ఉన్నట్టుండి రియోరాజ్ నిర్మాతగా అవతారమెత్తారు. ఈయన రమేష్ అనే ఆయనతో కలిసి రివర్ రూట్ స్టూడియోస్ అండ్ రెడ్‌లాక్ స్టూడియోస్ సంస్థలపై నిర్మిస్తున్న చిత్రం బ్రౌన్‌మణి. నటుడు రామ్ నిశాంత్, జేకే.కవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కదిరవన్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మంచి నిపుణులైన సాంకేతిక వర్గం పనిచేస్తున్నారని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు, నిర్మాత లియోరాజ్ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాకు విడుదల చేసిన చిత్ర వివరాలను తెలుపుతూ చిత్ర షూటింగ్ దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. కుటుంబం స్నేహితుల నేపథ్యంలో సాగే వినోదభరిత కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ, చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కవిన్.జీటీ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండ గా, దేవ్ ప్రకాష్ రీగన్ సంగీతాన్ని, శక్తి సుబ్రహ్మణ్యన్ చాయాగ్రహ ణం అందిస్తున్నారు.
బౌన్‌మణి ఫస్ట్‌లుక్ పోస్టర్
తమిళసినిమా: ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు నటించిన నటుడు జయ్ చిన్న గ్యాప్ తర్వాత కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం సటెండ్రు మారుదు వానం. నటి మీనాక్షి గోవిందరాజన్, నైతిక నటిస్తున్న ఇందులో యోగిబాబు, కేజీఎఫ్ ఫేమ్ గరుడరామ్, శ్రీమాన్, ఆదిత్య కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ వద్ద సర్కార్, దర్బార్ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన బాబు విజయ్ ఈచిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. బీవీ ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాధన్ చాయాగ్రహణం, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర జరుపుకుంటోందని, చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. చిత్ర విడుదలపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.
సటెండ్రు
మారుదు వానంలో మీనాక్షి
గోవిందరాజన్,
జయ్


