వేలూరు: కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం రాణి పేట జిల్లా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలోని మూలవర్ ధన్వంతరి స్వామికి తేనాభిషేకం నిర్వహించారు. మే 1వతేదీన ప్రపంచం కార్మికుల దినోత్సవా న్ని పురస్కరించుకొని ధన్వంతరి పీఠంలో ప్రతి సంవత్సరం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ధన్వంతరి ఆరోగ్య పీఠం పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమం కోసం, ఆరోగ్యంగా ఉండాలని, కుటంబం సంక్షేమంగా ఉండాలని కోరుతూ పీఠంలోని మూలవర్‌కు తేనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మురళీధరస్వామిజీ మాట్లా డుతూ దేశానికి వెన్నెమొకగా కార్మికులు ఉన్నారన్నా రు. కార్మికులు సంక్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందన్నారు. దేశంలోని ఏ శాఖలోనైనా అభివృద్ధి సాధించాలంటే అది కార్మికులతోనే సాధ్యమన్నారు. అనంతరం కార్మికుల సంక్షేమం కోసం పలు పూజలు నిర్వహించారు. హోమ పూజల్లో ధన్వంతరి కుటుంబ సభ్యులు, కార్మికులు, భక్తులు పాల్గొన్నారు.


