రజనీ గుడిలో అభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

రజనీ గుడిలో అభిషేకాలు

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

సాక్షి, చైన్నె: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే పురస్కరించుకుని మదురై జిల్లా తిరుమంగళంలో ఉన్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు, అభిషేకా లు నిర్వహించారు. రజనీకాంత్‌కు వీరా భిమాని అయిన కార్తీక్‌ అనే మాజీ సైనికుడు తన ఇంటి వద్దే నల్లరాతితో రెండు విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ రజనీ ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

బాషా కటౌట్‌..16 రకాల అభిషేకాలు

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మేడే వేడుకలను కార్తీక్‌ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా ఈ ఏడాది వేడుకలు జరిగాయి. రజనీకాంత్‌ నటించిన బాషా చిత్రంలోని ఆటోడ్రైవర్‌ గెటప్‌లో ఉన్న భారీ కటౌట్‌ను ఆలయంలో ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. రజనీకాంత్‌ విగ్రహాలకు 16 రకాల ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం చేశారు. అభిషేకం అనంతరం కార్మికులందరి జీవితాలు సుభిక్షంగా సాగాలని, అందరికీ మేలు జరగాలని ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కార్మికులకు, భక్తులకు తీపి పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజనీ అభిమాని కార్తీక్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేడే నాడు తమ కులదైవం లాంటి రజనీకాంత్‌ ఆలయంలో కార్మికులకు గౌరవార్థం ఈ వేడుకలను జరపడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement