సీయూబీకి కొత్త సీఈఓగా విజయ్‌ ఆనంద్‌ | - | Sakshi
Sakshi News home page

సీయూబీకి కొత్త సీఈఓగా విజయ్‌ ఆనంద్‌

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

సాక్షి, చైన్నె: సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సి యూ బి) ఒక కీలక నాయకత్వ మార్పును బుధవారం ప్రకటించారు. ఈ సంస్థలో 15 సంవత్సరాల విశిష్ట పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న డాక్టర్‌ ఎన్‌. కామకోటి స్థానంలో, విజయ్‌ ఆనంద్‌ మే 1 నుండి మేనేజింగ్‌ డైరెక్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ కామకోటి మాట్లాడుతూ, 28 సంవత్సరాల బ్యాంకింగ్‌ అనుభవం కలిగిన ఆనంద్‌, 2023లో సీయూబీ లో ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా చేరి, 2024లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారని వివరించారు., సీయూబీ కి ముందు, ఆయన ఆర్‌బీ ఎల్‌ బ్యాంక్‌లో రిటైల్‌ అసెట్స్‌ విభాగానికి బిజినెస్‌ అండ్‌ కలెక్షన్‌న్స్‌ హెడ్‌గా పనిచేశారని పేర్కొన్నారు. కాగా సీయూబీ ఫౌండేషన్‌కు డాక్టర్‌ కామకోటి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2010 –11 నుండి 2025– 26 ఆర్ధిక సంవత్సరం వరకు డాక్టర్‌ కామకోటి నాయకత్వంలో, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ డిపాజిట్లు ఆరు రెట్లు, అడ్వాన్సులలో 87 రెట్లు వృద్ధి సాధించిందని ఈ సందర్భంగా వివరించారు. 1,000 శాఖలకు శాఖల విస్తరణ,నికర విలువ రూ.10,000 కోట్లు దాటిందని ఈ సందర్భంగా విజయ్‌ ఆనంద్‌ తెలిపారు. 2025–26 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధిక త్రైమాసికంలో రూ. 360 కోట్ల నికర లాభం సాధించినట్టు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement