ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన కవితే 29 చిత్రం | - | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన కవితే 29 చిత్రం

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

తమిళసినిమా: దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌, కార్తీకేయన్‌ సాంతానంకు చెందిన స్టోన్‌బెంచ్‌ స్టూడియో, లోకేశ్‌ కనకరాజ్‌కు చెందిన జీ.స్క్వాడ్‌ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం 29. మేయాదమాన్‌ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రత్నకుమార్‌ తాజాగా కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు విదు,నటి ప్రీతీ అస్రాని జంటగా నటించారు. నటుడు మహేంద్రన్‌, అవినాష్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 8వ తేధీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ఓ హోటల్‌లో నిర్విహించిన చిత్ర ఫ్రీ రిలీజ్‌ కార్యక్రమంలో దర్శకుడు లోకేశ్‌ కరకరాజ్‌, కార్తీక్‌సుబ్బరాజ్‌, కార్తికేయన్‌ సంతానం, ఆర్‌జే.బాలాజీ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు రత్నకుమార్‌ మాట్లాడుతూ ఈ చిత్రం రూపొందడానికి ముఖ్య కారణరం నిర్మాత కార్తీకేయన్‌ సంతానం అని పేర్కొన్నారు. మేయాదమాన్‌ చిత్రం తరువాత తాను చిన్న కవితను షేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశానన్నారు. అంది చూసిన ఒక నిర్మాత దీన్నే కథఽగా తయారు చేసి చిత్రంగా చేయవచ్చునని, కాబట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఆ కవితను వేరెవరూ కాపీ కొట్టకుండా వెంటనే తీసేయమని సలహా ఇచ్చారన్నారు. ఆ తరువాత తాను తయారు చేసిన కథను తమ స్టోన్‌బెంచ్‌ స్టూడియో సంస్ధలోనే చేయాలని నిర్మాత కార్తికేయన్‌ సంతానం పట్టు బట్టారన్నారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కిందని చెప్పారు. లోకేశ్‌ కనకరాజ్‌ కథ కూడా వినకుండా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకోవడానికి సిద్ధం అయ్యారన్నారు. ఒక 29 ఏళ్ల యువకుడి జీవితంలోకి 22 ఏళ్ల యువతి వస్తుందన్నారు. వారి మధ్య ప్రేమ, తదితర అంశాలతో కూడిన చిత్రం 29 అని చెప్పారు. రత్నకుమార్‌ మిత్రుడని కాకుండా, ఆయనలో మంచి కథకుడు ఉన్నాడని ఈ చిత్రం చేసినట్లు దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement