లవ్‌ ఓ లవ్‌ షూటింగ్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

లవ్‌ ఓ లవ్‌ షూటింగ్‌ పూర్తి

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

తమిళసినిమా: ఇంతకుముందు నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడీ కోపం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన యువ నటుడు పవీష్‌ నారాయన్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం లవ్‌ ఓ లవ్‌. పాపులర్‌ తెలుగు యూట్యూబర్‌ నాగదుర్గ ఈ చిత్రంలో కథానాయికిగా నటించగా దర్శకుడు సెల్వరాఘవన్‌, దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌, వనిత విజయకుమార్‌, రమ్య, ఆదిత్య ఖదిర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మహేష్‌ రాజేంద్రన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని జి సినిమా స్టూడియో అండ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత దినేష్‌రాజ్‌, క్రియేటివ్‌ ఎంటర్‌ టైనర్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత జి.ధనుంజయన్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తంతో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవల విజయ్‌ సేతుపతి విడుదల చేశారని, దీంతో చిత్రానికి మంచి ప్రచారం లభించిందన్నారు. ఈచిత్రాన్ని ఈ సమ్మర్‌లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి పిజీ.ముత్తయ్య చాయాగ్రహణం, ప్రదీప్‌.పీజే, వైపేపవే ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement