జోరందుకన్న అరసన్‌ షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

జోరందుకన్న అరసన్‌ షూటింగ్‌

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

తమిళసినిమా: నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అరసన్‌. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌.ధాను తన వి.క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం కావడంతో అరసన్‌పై భారీ అంచనాలు నెలకుంటున్నాయి. నటుడు విజయ్‌సేతుపతి పోలీస్‌ అధికారిగా కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో నటి ఆండ్రియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ను నిర్మాతల మండలి ఇటీవల నిలిపేసిన విషయం తెలిసిందే. నటుడు శింబు, నిర్మాత ఐసరిగణేశ్‌లకు మధ్య వివాదం కారణంగా అరసన్‌ చిత్ర షూటింగ్‌ను నిలిపేశారు. కాగా ఆ సమస్య పరిష్కారం కావడంతో అరసన్‌ చిత్రం షూటింగ్‌ ఇటీవల మళ్లీ ప్రారంభం అయ్యింది. ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్స్‌ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం నటుడు శింబు ఇంతకు ముందు నటించిన చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ చైన్నెలో శరవేగంగా జరుగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement