ఘనంగా దేవసేన కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా దేవసేన కల్యాణోత్సవం

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

తిరుత్తణి: చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దేవసేన కల్యాణోత్సవం కోలాహలంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని కల్యాణోత్సవం తిలకించి స్వామిని దర్శించుకున్నారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు 21న ద్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. వేడుకల సందర్భంగా మూలవర్లకు రోజూ అభిషేక పూజలు నిర్వహించి మహాదీపారాధన చేశారు. ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక అలంకరణలో రోజూ ఉయదం సాయంత్రం సమయాల్లో వాహన సేవల్లో కొలువుదీరి మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిద రోజైన మంగళవారం రాత్రి కొండ ఆలయంలోని వెనుక భాగంలో దేవసేన మండపంలో దేవసేన కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న కల్యాణోత్సవానికి వీలుగా మహిళలు పట్టు వస్త్రాలు, పూజా సామగ్రి, పుష్పాలు, పండ్లు వరుసగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు దేవసేన కల్యాణోత్సవంను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవసేన కల్యాణోత్సవం నిర్వహించి అక్షింతలు వేసి కల్యాణోత్సవం చేపట్టగా భక్తులు హారంహర నామస్మరణతో స్వామివారి కల్యాణోత్సవం తిలకించి దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement