వేలూరు: వేలూరు కలెక్టరేట్‌కు బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ మెయిల్ పంపారు. ఆ ఈ మెయిల్‌ను కలెక్టరేట్‌లోని అధికారులు చూడగా అందులో పేర్కొన్న విధంగా మంగళవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్ పంపగా వాటిని పరిశీలించిన అధికారులు బాంబు స్క్వాడ్‌ను రప్పించి కలెక్టరేట్‌లో తనిఖీలు చేశారు. బాంబు ఏదీ కనిపించలేదని నిర్లక్ష్యంగా ఉండిపోయారు. అయితే బుధవారం పెట్టిన బాంబు తప్పకుండా పేలడం ఖాయమని హెచ్చరించి మెయిల్ పంపారు. వీటిని గమనించిన కలెక్టరేట్‌లోని అధికారులు వెంటనే వేలూరు ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే ఎటువంటి బాంబు కనిపించకపోవడంతో పోలీసులు, కలెక్టరేట్‌లోని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ బాంబు స్క్వాడ్ కలెక్టరేట్‌లోనే నిఘా పెట్టారు. ఇప్పటికే కలెక్టరేట్‌కు మూడు సార్లు బాంబు బూచి ఈ మెయిల్ రావడంతో ప్రస్తుతం మరోసారి రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.


