సాక్షి, చైన్నె: దేశీయ సాంకేతిక విద్యా రంగంలో కొత్త ఒరవడి దిశగా చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ – ఈశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రపంచ స్థాయి రోబోటిక్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏబీబీ రోబోటిక్స్ సంస్థ ఏర్పాటు చేసిన మూడవ కేంద్రం ఇది కావడం విశేషం. ఈ కేంద్రం కేవలం ల్యాబ్ మాత్రమే కాదు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా కేంద్రం. ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ –ఎనేబుల్డ్ రోబోటిక్ సిస్టమ్స్‌లో 3డీ పిన్ పికింగ్, ప్యాలైటెజింగ్, స్పాట్ , ఆర్క్ వెల్డింగ్ వంటి క్లిష్టమైన పనులను చేసే రోబోలు, వర్చువల్ రియాలిటీ ఆధారిత సిమ్యులేషన్ సెల్స్, డిజిటల్ ట్విన్, అటానమస్ మొబైల్ రోబోలు, జనరేటివ్ ఏఐ, విజన్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌వంటివి ఇందులో ఉన్నాయి. విద్యార్థులకు ప్రయోజనాలు, స్టార్టప్‌లకు సరికొత్త అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు.ఈ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ ఆర్. శివకుమార్, ఏబీబీ రోబోటిక్స్ ప్రెసిడెంట్ సుబ్రత కర్మాకర్ , అదిత్యారామ్ గ్రూప్ ఎం.డి అదిత్యారామ్, అదానీ రియల్టీ సి.ఓ.ఓ అన్బు జయబాలన్‌తో పాటూ వైద్యులు, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.


