నిఽధి నెలవారీ ఖర్చు ఎంతో తెలుసా? | - | Sakshi
Sakshi News home page

నిఽధి నెలవారీ ఖర్చు ఎంతో తెలుసా?

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

తమిళసినిమా: నిధి అగర్వాల్‌ పాన్‌ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. అయితే నటిగా దశాబ్దానికి చేరువు అవుతున్నా, ఈ 33 ఏళ్ల మార్వాడీ బ్యూటీ ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నాని చెప్పక తప్పదు . అదే సమయంలో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే సంపాందిస్తున్నా, ఐరన్‌లెగ్‌ అనే ముద్ర నుంచి ఇంకా బయట పడలేదు. ఇక ప్రేమ వ్యవహారంలోనూ బాగానే వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య నటుడు శింబుతో ప్రేమాయణం అంటూ ప్రచారం వైరల్‌ అయ్యింది. అప్పుడామె ఆయనకు జంటగా ఈశ్వర్‌ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం సక్సెస్‌ కాకపోయినా, ప్రేయాయణం వార్తలతో బాగానే పాపులర్‌ అయ్యారు. ఇక కోలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన మరో చిత్రం భూమి. జయంరవికి జంటగా నటించిన ఆ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వడంతో నిధి అగర్వాల్‌ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. ఆ మధ్య తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నా, అది పూర్తిగా నీరుగార్చింది. ఇటీవల ప్రభాస్‌ హీరోగా నటించిన రాజాసాబ్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. అదీ ఆఽశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నెల ఖర్చు గురించి ఒక భేటీలో నిధిఅగర్వాల్‌ పేర్కొన్నారు. అందులో ‘ నా నెల ఖర్చు ఎంతో తెలుసా ? అంటూ చెప్పడం ప్రారంభించారు. నా నెలవారి ఖర్చు రూ. 5 లక్షలు అని పేర్కొన్నారు. నా ట్రావెలింగ్‌, బస,డయిట్‌,జిమ్‌, ట్రైనర్‌, పార్లర్‌ ఖర్చులకే రూ. 5 లక్షలు అవుతుంది. ఇవి కాకుండా మేకప్‌, హెయిర్‌స్టైలింగ్‌, ఫోటోస్‌ వంటి ఖర్చులను కొన్ని సార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించినా, కొన్ని సార్లు నేను భరించాల్సి ఉంటుంది’ అని నటి నిధి అగర్వాల్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement