క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

ఇంట్లోకి చొరబడి 76 ఏళ్ల వద్ధురాలిపై అత్యాచారం

– 57 ఏళ్ల వ్యక్తి అరెస్ట్‌

తిరువొత్తియూరు: చైన్నె, పులియంతోపు ప్రాంతంలో 76 ఏళ్ల వద్ధురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నప్పటికీ, వారు సమీపంలోనే వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె కుమార్తె రోజూ వచ్చి ఆమెకు స్నా నం చేయించి, భోజనం పెట్టి వెళ్తుండేవారు. ఈక్రమంలో, ఆదివారం ఆ వద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అదే ప్రాంతానికి చెందిన మరుదప్పన్‌ (57) అనే ప్లంబర్‌ ఆమె ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పులియంతోపు మహిళా పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి మరుదప్పన్‌ను అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు.

30 నుండి చైన్నె నుంచి ప్రత్యేక బస్సులు

– చిత్రా పౌర్ణమి సందర్భంగా

తిరువణ్ణామలైకి అదనపు బస్సులు

తిరువొత్తియూరు: చిత్రా పౌర్ణమి ప్రత్యేకరోజును పురస్కరించుకుని తిరువణ్ణామలై ఆలయానికి వచ్చే భక్తుల కోసం తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. చిత్ర పౌర్ణమి గురువారం (ఏప్రిల్‌ 30) రాత్రి 9.50 గంటలకు ప్రారంభమై, శుక్రవారం రాత్రి 11.07 గంటలకు ముగుస్తుంది.ఈ నేపథ్యంలో చైన్నె, విల్లుపురం, దిండివనం, కాంచీపురం తిరువళ్లూరు వంటి ప్రధాన నగరాల నుంచి తిరువణ్ణామలైకి అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మే 1వ తేదీ శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో శని, ఆదివారాలతో కలిపి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. దీనివల్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉంటోంది. దక్షిణ జిల్లాలకు వెళ్లే రైళ్లు ఇప్పటికే నిండిపోవడంతో, ప్రజలు ప్రభుత్వ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులు రద్దీని తట్టుకోవడానికి ప్రభుత్వ రవాణా సంస్థ ఎస్‌ ఈటీసీ బస్సుల్లో ముందస్తుగా టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

తిరునాగేశ్వర స్వామి

ఆలయంలో రథోత్సవం

తిరువొత్తియూరు: కుండ్రత్తూరులో వెలిసిన తిరునాగేశ్వర ఆలయంలో రథోత్సవం మంగళవారం కోలాహలంగా జరిగింది కుండ్రత్తూరులో ప్రసిద్ధ తిరునాగేశ్వర స్వామి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నవగ్రహ స్థలాలలో రాహు స్థలంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో, గత 22వ తేదీన ధ్వజారోహణంతో ఈ ఉత్సవా లు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటూ జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా, 7వ రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అలంకరించిన రథంపై తిరునాగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీఎం అన్బరసన్‌, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఎంఎల్‌ఏ రథం తాడును లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు హర ,హర మహా దేవ, నాగేశా అనే నామస్మరణలతో రథాన్ని ప్రధాన వీధుల గుండా లాగారు. ఈ ఉత్సవానికి హాజరైన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేశారు. కుండ్రత్తూరు పోలీసులు భారీ భద్రతను పర్యవేక్షించగా, రథోత్సవం దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లించారు. వండలూరు – మీంజూర్‌ వెలుపల రింగ్‌ రోడ్డు మీదుగా వాహనాలను అనుమతించారు.

సింగ్‌ హెల్త్‌తో అతుల్య

సీనియర్‌ కేర్‌ ఒప్పందం

కొరుక్కుపేట: వైద్య సేవలు, వృత్తిపరమైన శిక్షణ, పరిశోధన , విజ్ఞాన మార్పిడి రంగాలలో సహకారాన్ని అందిస్తున్న అతుల్య సీనియర్‌ కేర్‌, సింగపూర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థ సింగ్‌హెల్త్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో సింగ్‌ హెల్త్‌ ఇంటర్నేషనల్‌ కొలాబ్రేషన్‌ ఆఫీసు డైరెక్టర్‌ విజయరావు మాట్లాడుతూ సింగ్‌హెల్త్‌ అనేది అక్యూట్‌ హాస్పిటల్స్‌, స్పెషలిస్ట్‌ సెంటర్లు, పాలిక్లినిక్‌లు , కమ్యూనిటీ హాస్పిటల్స్‌తో కూడిన ఒక విస్తృతమైన సంస్థల నెట్‌వర్క్‌ను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. వృద్ధాప్య జనాభా కారణంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వృద్ధుల సంరక్షణ నాణ్యతను , అందుబాటును మెరుగుపరచాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ అవగాహన ఒప్పంద భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందన్నారు. సీనియర్‌ లివింగ్‌ , కంటిన్యూమ్‌ కేర్‌లో అతుల్యకు ఉన్న నైపుణ్యాన్ని, సింగ్‌హెల్త్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్లినికల్‌, అకడమిక్‌ సామర్థ్యాలతో కలపడం ద్వారా, ఈ భాగస్వామ్యం రెండు సంస్థలలోనూ సంరక్షణ పంపిణీని బలోపేతం లక్ష్యంగా ముందుకెళ్ళుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతుల్య సీనియర్‌ కేర్‌ సీఈఓ శ్రీనివాసన్‌, సింగ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ లండన్‌ లుసీన్‌ ఓయ్‌ , ప్రతినిధి కృష్ణన్‌ కావ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement