సంజయ్ లీలా బన్సాలి
తమిళ సినిమా: కోలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న నటుడు ధనుష్ బాలీవుడ్, హాలీవుడ్‌ను సైతం ఎప్పుడో టచ్ చేశారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన కర చిత్రం ఈ నెల 30న తెరపైకి రానుంది. ప్రస్తుతం అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత లబ్బర్‌బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత సంజయ్ లీలా బన్సాలి నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యినట్లు సమాచారం. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈయన ఇంతకు ముందు ఇరుంబు తిరై, హలో, సర్ధార్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా ఈయన ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి నిర్మించ తలపెట్టిన హిందీ చిత్రం రౌడీ రాధోర్– 2 చిత్రానికి గ్రౌండ్ వర్క్ చేసినట్లు, అయితే అది బడ్జెట్ కారణంగా సెట్‌పైకి వెళ్లలేదని సమాచారం. దీంతో మరో కొత్త చిత్రం చేయడానికి సిద్ధంకాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ కథను రెడీ చేసినట్లు, ఇందులో మొదట టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్‌ను నటింపజేయడానికి చర్చలు జరిగినట్లు టాక్. ఆ తరువాత తాజాగా నటుడు ధనుష్ హీరోగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం హిందీలో తెరకెక్కనుందా? లేక పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుందా? అన్ని విషయంలో క్లారిటీ లేదు. ఇకపోతే నటుడు ధనుష్ ఇప్పటికే హిందీలో రాంజానా, అంత్రాంగి రే, తేరే ఇష్క్ మే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా సంజయ్ లీలా బన్సాలి నిర్మించనున్న చిత్రాన్ని అంతకు మంచి భారీ బడ్జెట్‌లో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు, ఈ చిత్రం 2927 మొదటి భాగంలో ప్రారంభం కానుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది.
నటుడు ధనుష్


