తమిళసినిమా: కోలీవుడ్‌లో పాత నీరు పారడం ఏమోగానీ, కొత్త నీరు మాత్రం ప్రవహిస్తూనే ఉంది. నవతరం నటులు తమ సత్తా చాటు కుంటున్నారు.అలా తాజాగా కథానాయకుడిగా ఎదుగుతున్న యువ నటుడు క్రితిక్‌మోహన్. ఈ చార్మింగ్ కుర్రాడు చిన్న వయసులోనే సినీ రంగప్రవేశం చేశాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలోనే విజయ్ వసంత్ హీరోగా నటించిన అచ్చమిండ్రి అనే చిత్రంలో, చిన్న పాత్రలో మెరిశారు. ఆ తరువాత అవకాశాలు పలకరించినా చదువుకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో నటనకు విరామం ఇచ్చారు. ఆ తరువాత సుబ్బురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంజామై చిత్రంలో నీట్ పరీక్ష కారణంగా బాధింపుకు గురైన ప్లస్ 2 విద్యార్దిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే కుర్రాడు ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చిత్రంతో ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా అవతారమెత్తారు. గాంధీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇందులో ఈ తరం ప్రేమికుడిగా, ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యువకుడిగా నటించి అందరి ప్రశంసలు పొందుతున్నారు .ఈ చిత్రంలోని ప్రేమ సన్నివేశాల్లో, ఉద్వేగభరిత సన్నివేశాల్లో పరిణితి చెందిన నటనను ప్రదర్శించారు. కాగా ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం షూటింగ్ హోసూర్ సమీపంలో జరుపుకుంటోందని క్రితిక్‌మోహన్ చెప్పారు. ఇది చాలా ఆశ్యర్యానికి గురి చేసే యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న కథా చిత్రం అని పేర్కొన్నారు. మరి న్ని అవకాశాలు వస్తున్నాయని, కచ్చితంగా కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతానని కృతిక్ మోహన్ చాలా నమ్మకా న్ని వ్యక్తం చేస్తున్నారు.
నటుడు క్రితిక్‌మోహన్


