తమిళసినిమా: ఆదిత్యవర్మ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు విక్రమ్ వారసుడు ధృవ్. ఆ చిత్రం నిరాశపరచింది. ఆ తరువాత తండ్రి విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో ధృవ్ నటనకు మంచి మార్కులు పడ్డా ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. కాగా ఈ యువ నటుడు నటించిన మూడో చిత్రం బైసన్. మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ నాయకిగా నటించారు. ఇది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక కబడ్డి కళాకారుడి ఇతి వృత్తంతో సాగే కథాంఽశంతో తెరకెక్కింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, నటుడు ధృవ్‌కు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. దానితో పాటూ నటి అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమాయణం అనే ప్రచారానికి కారణం అయ్యింది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాంధించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. గత 2015లో ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన ఈ కేరళా కుట్టి ఎక్కువగా తెలుగులోనే అవకాశాలను అందుకుంటున్నారు. తమిళంలో ధనుష్‌కు జంటగా కొడి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇక్కడ కొన్ని చిత్రాలలోనే నటించిన అనుపమ పరమేశ్వరన్ చివరిగా నటించిన చిత్రం బైసన్. ఇందులో ఒక పల్లెటూరి యువతిగా నటించి మంచి మార్కులే కొట్టేశారు. కాగా ఇటీవల నటుడు ధృవ్ సిక్స్‌పాక్‌తో కూడిన తన బాడీబిల్డింగ్ ఫొటోతో కూడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోకు మొదటి కామెంట్‌గా నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అనే ఎమోజీని పోస్ట్ చేశారు. ఆమె కామెంట్‌కు ఒక్క రోజులోనే 12 వేలకు పైగా లైక్స్ రావడం విశషం. అయితే ధృవ్ సిక్స్‌ప్యాక్ ఫొటోకు నటి అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అంటూ రియాక్ట్ కావడం ఇప్పుడు ట్రోలింగ్‌కు దారి తీసింది. మరో ప్రేమ జంటా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


