రిన్యూఎక్స్‌– 2026 సదస్సు ఆరంభం | - | Sakshi
Sakshi News home page

రిన్యూఎక్స్‌– 2026 సదస్సు ఆరంభం

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

కొరుక్కుపేట: భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనపై దశాబ్దపు ప్రభావాన్ని సూచిస్తూ, చైన్నెలో రిన్యూఎక్స్‌ 2026 సదస్సు, ఎక్స్‌ పో సోమవారం ప్రారంభమైంది. ఇన్ఫార్మా మార్కెట్స్‌ ఇన్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన 10వ ఎడిషన్‌ ఎక్స్‌ పో చైన్నె ట్రేడ్‌ సెంటర్‌ వేదికై ంది. ‘‘ప్రభావవంతమైన దశాబ్దం – సమద్ధిగల భవిష్యత్తు’’ అనే పేరుతో సాగుతున్న ఈ సదస్సులో 200కు పైగా ప్రముఖ బ్రాండ్లు, 50 మందికి పైగా విశిష్ట వక్తలు, 8,000 మందికి పైగా పరిశ్రమ నిపుణులు పాల్గొంటున్నారు. ఇది సౌరశక్తి, శక్తి నిల్వ, బయో–ఎనర్జీ, స్మార్ట్‌ గ్రిడ్లు, మరియు అభివద్ధి చెందుతున్న స్వచ్ఛమైన సాంకేతికతల కోసం ఈ వేదికను ఒక కీలకమైన మార్కెట్‌ప్లేస్‌గా నిలుపుతోందని ఇన్ఫార్మా మార్కెట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోగేష్‌ ముద్రాస్‌ తెలిపారు. ఇందులో ఫ్రాస్ట్‌ అండ్‌ సల్లివన్‌, ఎకనామిక్‌ అనలిటిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ నేహా థామస్‌ , చైన్నె ఆస్ట్రేలియన్‌ కాన్సుల్‌–జనరల్‌ సిలై జాకీ ; తమిళనాడు సోలార్‌ ఎనర్జీ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి. శివకుమార్‌ , ఇన్ఫార్మా మార్కెట్స్‌ ఇన్‌ ఇండియా సీనియర్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ – ఎనర్జీ పోర్ట్‌ఫోలియో రజనీష్‌ ఖత్తర్‌ సహా పలువురు ప్రముఖ పరిశ్రమ నాయకులు పాల్గొని మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement