వీధికుక్కలకు వ్యాక్సిన్లు | - | Sakshi
Sakshi News home page

వీధికుక్కలకు వ్యాక్సిన్లు

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

వీధికుక్కలకు వ్యాక్సిన్లు

తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో వీధికుక్కలు దాడి చేసి 8 మందిని గాయపర్చిన నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలను చేపట్టారు. గ్రామంలో సుమారు 45 వీధికుక్కలను గుర్తించి వాటికి వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ పూవనూర్‌, కల్లంబేడు తదితర గ్రామాల్లో వీధికుక్కలు దాడి చేసింది. వీధికుక్కలు దాడిలో గీత(32), సాయిచిన్నరాసు(28), కుప్పన్‌(52) కల్లంబేడు గ్రామానికి చెందిన శరవణన్‌(38), మణిమేఖలై(42) తదితరులు అదే గ్రామంలోని ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. వీరిపై వీధికుక్కలు ఆదివారం దాడి చేసింది. కుక్కల దాడిలో గాయపడ్డ వారిని స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్సను అందించారు. ఈ క్రమంలో రెండు గ్రామాల్లోనూ వీధికుక్కల దాడిపై ఆరా తీసిన కలెక్టర్‌ ప్రతాప్‌ అక్కడ తక్షణం వ్యాక్సిన్‌ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం రెండు బృందాలుగా ఏర్పడిన సిబ్బంది పూవనూర్‌, కల్లంబేడ తదితర రెండు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపును నిర్వహించి 45 వీధికుక్కలకు వ్యాక్సిన్‌ను వేశారు. అదే విధంగా మంగళవారం ఉదయం పిల్లయార్‌కుప్పం, కూవం తదితర గ్రామాల్లోనూ వీధికుక్కలకు వ్యాక్సిన్‌ వేయనున్నట్టు కడంబత్తూరు బ్లాక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రవి, నటరాజన్‌ తదితరులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement