పళ్లిపట్టు: పుణ్యం గ్రామంలో నూతనంగా నిర్మించిన సప్త కన్యల ఆలయ మహాకుంభాభిషేకం సోమవారం ఉదయం కోలాహలంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. పళ్లిపట్టు సమీపంలోని పుణ్యం గ్రామంలో గ్రామీణుల సంయుక్త సహకారంతో సప్త కన్యలకు ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజలపాటు మహాకుంభాభిషేకం వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు యాగశాలలు ఏర్పాటు చేసి హోమగుండ పూజలు చేపట్టారు. సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మేళ తాళాలతో భారీ సంఖ్యలో మహిళలు నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి సప్త కన్యల విగ్రహాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు.


