వేడుకగా రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా రథోత్సవం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

వేడుకగా రథోత్సవం

తిరువళ్లూరు: కూవం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీత్రిపుర సుందరి సమేత త్రిపురాంతాక స్వామివారి ఆలయంలో రఽథోత్సవం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ కూవం గ్రామంలో దేవదాయశాఖకు చెందిన త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామివారి ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా ఛైత్రమాసం బ్రహ్మోత్సవాలను పది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 21న ద్వజారోహణంతో ప్రారంభించారు. ఏడో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారు సమీపంంలోని మండపానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు అందుకుని అక్కడి నుంచి రథానికి చేరుకున్నారు. అనంతరం రథం నాలుగు మాడవీధుల్లో సాగింది.

Advertisement
 
Advertisement
Advertisement