కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

వేలూరు: వేలూరు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌, వేలూరు జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపు మే 4న వేలూరు తందైపెరియార్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరగనుంది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వేలూరులోని కౌంటింగ్‌ సెంటర్‌లోని ఏర్పాట్లను కలెక్టర్‌ సుబ్బలక్ష్మితో పాటూ ఉన్నతాధికారులు సోమవా రం కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల బృందం కౌంటింగ్‌ చేసే గది, కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటివి కెమరాల నమో దు, ఇందుకు అసరమైన బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించారు. ఈవీఎం మిషన్‌లు ఉంచిన ప్రాంతంలో ఉంచిన రిజిస్టర్‌లో సంతకాలు చేసి రోజూ ఎవరు వస్తున్నారు..? అనే విషయాన్ని పేర్లు నమో దు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement