తమిళసినిమా: నటి దుషారా విజయన్, అతిథిబాలన్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ఎగ్జామ్. వాల్‌వచ్చార్ ఫిలింస్ పతాకంపై దర్శక ద్వయం గాయత్రి పుష్కర్‌లు నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు జాతీయ ఉత్తమ దర్శకుడు సర్గుణం దర్శకత్వం వహించారు. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఇందులో నటుడు అబ్బాస్ కీలక పాత్రను పోషించారు. తమిళంలో పాటూ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర 15 భాషల్లో అనువాదం చేసిన ఈ వెబ్ సిరీస్‌ను మే 15 నుంచి ప్రైమ్ టైమ్ ఓటీటీలో 140కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రియెటీవ్ ప్రొడ్రూసర్స్ గాయత్రి పుష్కర్ దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఈ ఎగ్జాయ్ సిరీస్ ద్వారా మనుషుల ఆశ, అవినీతి, చివరికి వారు ఎదుర్కొనే సమస్యలను తెలిపే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. చాలా గడ్డు పరిస్థితుల్లో బలహీన పడకుండా సమస్యలపై పోరాటం చేసే యువతి ఇతి వృత్తమే ఈ సిరీస్ ప్రధానాంశమని పేర్కొన్నారు. తమ సిరీస్‌ను ప్రైమ్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయనుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ సిరీస్ అందరికీ నచ్చుతందనే నమ్మకం తమకుందన్నారు.


