రోజుకో పేటెంటే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రోజుకో పేటెంటే లక్ష్యం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ కామకోటి

కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు వరుసగా రెండవ సంవత్సరం స్టార్టప్‌ శతమ్‌ సాధించి, రోజుకు ఒక పెటెంట్‌ ఊపును కొనసాగిస్తుందని ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి అన్నారు ఈ మేరకు ఐఐటీఎం క్యాంపస్‌లో జరిగిన ప్రపంచ ఐపీ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, స్టార్టప్‌ వ్యవస్థాపకులతో సమావేశంలో కామకోటి పలు అంశాలపై మాట్లాడారు. ఐఐటీఎం ఇంక్యుబేషన్‌ సెల్‌ ద్వారా 112 స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్‌ అందించడం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 431 పేటెంట్లను దాఖలు చేశామన్నారు. దీంతో డీప్‌–టెక్‌ ఆవిష్కరణ వ్యవస్థాపకతలో ఇనిస్టిట్యూట్‌ తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుందన్నారు. ఈ విజయాలు డీప్‌–టెక్‌ వ్యవస్థాపకత, అనువర్తిత పరిశోధన, మేధో సంపత్తి సృష్టి రంగాలలో భారతదేశంలోని అగ్రగామి ఉన్నత విద్యా సంస్థలలో ఒకటిగా ఐఐటీ మద్రాస్‌ నిలిచిందన్నారు. తమ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులు, బయటి పారిశ్రామికవేత్తలు భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయగల సాంకేతికతలను, సంస్థలను సృష్టిస్తున్నారన్నారు. డీన్‌ (ఐసీఎస్‌ఆర్‌) ప్రొఫెసర్‌ మను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement