హిందూస్థాన్‌ స్కూల్‌కు గోల్డ్‌ రేటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

హిందూస్థాన్‌ స్కూల్‌కు గోల్డ్‌ రేటింగ్‌

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

సాక్షి, చైన్నె: విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, విద్యార్థులకు అత్యుత్తమ అభ్యా స అనుభవాన్ని అందిస్తున్నందుకుగాను చైన్నె గిండిలోని హిందూస్థాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రతిష్టాత్మకమైన క్యూఎస్‌ఐఅండ్‌ గైజ్‌ గోల్డ్‌ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈగుర్తింపు 2026 నుంచి 2028 వరకు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ గుర్తింపు అనేది విద్యాసంస్థల నాణ్యతను వివిధ అంశాల ఆధారంగా అంచనా వేసే స్వతంత్ర రేటింగ్‌ వ్యవస్థ కావడం గమనార్హం. హిందూస్థాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఈ కింది విభాగాల్లో అద్భుతమైన రేటింగ్స్‌ను సాధించింది: టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌, ఈ–లెర్నింగ్‌ సన్నద్ధత విభాగాల్లో అత్యున్నతమైన డైమండ్‌ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈసందర్భంగా హిందుస్థాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌ మాట్లాడుతూ శ్రీఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పాఠశాల కీలక పాత్ర పోషిస్తుందని మేము బలంగా నమ్ముతామన్నారు. ఈ గోల్డ్‌ రేటింగ్‌ రావడం గర్వకారణంగా పేర్కొంటూ, తమ సిబ్బంది, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement