కార్తీక్‌మోహన్‌కు కనిమొళి ఆశీస్సులు | - | Sakshi
Sakshi News home page

కార్తీక్‌మోహన్‌కు కనిమొళి ఆశీస్సులు

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

న్యూస్‌రీల్‌

సాక్షి, చైన్నె: విల్లివాక్కం డీఎంకే అభ్యర్థి కార్తీక్‌మోహన్‌కు ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత కనిమొళి కరుణానిధి తన ఆశీస్సులను అందజేశారు. అన్నానగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోహన్‌ ఈసారి తనకు బదులుగా కుమారుడు కార్తీక్‌ మోహన్‌కు సీటు ఇప్పించుకున్నారు. అయితే, అన్నానగర్‌ నుంచి కాకుండా పక్కనే ఉన్న విల్లివాక్కం నియోజకవర్గం నుంచి కార్తీక్‌మోహన్‌ పోటీకి దిగారు. ఈ పరిస్థితులలో మంగళవారం కనిమొళిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కార్తీక్‌కు తన ఆశీస్సులు, అభినందలను ఆమె అందజేశారు. నామినేషన్‌ దాఖలు తర్వాత ప్రచారంలో దూసుకెళ్లేందుకు కార్తీక్‌మోహన్‌ సిద్ధమయ్యారు.

డీఎంకే మేనిఫెస్టో

ఓ సూపర్‌స్టార్‌

సాక్షి, చైన్నె: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా దూసుకుపోయిందని, ఇది నిజమైన ‘సూపర్‌ స్టార్‌‘ అని మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ అభివర్ణించారు. కరూర్‌ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి త్యాగరాజాకు మద్దతుగా సెంథిల్‌ బాలాజీ మంగళవారం కోడంకిపట్టి ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ కరూర్‌ జిల్లా అభిబృద్ధి కోసం రూ. 5వేల కోట్లు కేటాయించారని, కేవలం కరూర్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే రూ.1,140 కోట్ల విలువైన పనులు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోతో పోలిస్తే డీఎంకే మేనిఫెస్టో ఒక సూపర్‌స్టార్‌ అని, ఇది సమాజంలోని అట్టడుగు వర్గాల వరకు చేరువైందన్నారు. ప్రజలందరూ ఉదయసూర్యుని గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు కరూర్‌ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో డీఎంకే క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అధిష్టానం ఆదేశంతో కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్నానని పేర్కొన్నారు. బుధవారం కరూర్‌ జిల్లా రాయనూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఏర్పాట్లను సెంథిల్‌ బాలాజీ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement