సాక్షి, చైన్నె: పార్టీల అగ్ర నేతలు ఎన్నికల ప్రచారబాట పట్టారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ తిరువారూర్‌లో తన ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రచారంలో అందరి కన్నా ముందున్నారు. తెన్కాశి జిల్లా కడయనల్లూరులో పర్యటించారు. తిరునల్వేలిలో దూసుకెళ్లారు. విరుదునగర్‌లో అనేక నియోజకవర్గాలలో మంగళవారం పర్యటించారు. బుధవారం తిరుచ్చి రామనాథపురం జిల్లాలో దూసుకెళ్లనున్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సైతం పరుగులు తీస్తున్నారు. సూలూరు, గౌండం పాళయంలో సాయంత్రం జరిగిన సభల్లో ప్రసంగించారు. ఇక, డీఎంకే యువజన నేత ఉదయనిధి స్టాలిన్ సోమవారం సాయంత్రం కాంచీపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ధర్మపురి జిల్లాలో పలు నియోజకవర్గాలలో ఓపెన్ టాప్ వాహనంలో ఓటర్లను ఆకర్షించారు.
బానిస పాలనను రానివ్వొద్దు
ధర్మపురిజిల్లా అరూర్ నియోజకవర్గంలో ఎన్ని కల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ,‘తమిళనాడులో అన్నాడీఎంకే బానిస పా లనను రానివ్వద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. డీఎంకే మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ, గత ఐదేళ్ల ప్రగతి పాలనను గుర్తు చేశా రు. ‘ఈ ఎన్నికలు ఢిల్లీకి, తమిళనాడుకు మధ్య జరుగుతున్న పోరు అని, మోదీనా, తమిళనా డా అని తేల్చుకోవాల్సిన సమయం ఇదేనని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకేకు వేసే ప్రతిఓటూ బీజేపీకి వేసినట్లే అని హెచ్చరించారు.
మన్సూర్ వినూత్నం
లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నటుడు మన్సూర్‌అలీఖాన్ వినూత్నంగా ప్ర చారంలో పరుగులు తీస్తున్నారు. కల్లకుడి రైల్వే పట్టాలపై పడుకుని వినూత్న ప్రచారం చేశా రు. దివంగత మాజీ సీఎం కరుణానిధి రాజకీయ జీవితంలో కల్లకుడి పోరాటం అత్యంత కీలకమైనదిగా చెపుతుంటారు. ఈ దృష్ట్యా, అదే నియోజకవర్గంలో పోటీచేస్తున్న మన్సూర్‌అలీఖాన్ ఆ పోరాట స్ఫూర్తిని చాటే విధంగా కాసేపు రైలు పట్టాలపై పడుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మార్గంలో మధ్యాహ్నం వరకు ఏ రైళ్లు రావు, ఈ దృష్ట్యా, ఆయన ధైర్యంగా పట్టాలపై కాసేపు పడుకున్నప్పటికీ, ఇది నిబంధనల ఉల్లంఘన అని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
స్టాలిన్ ప్రచార బాట
తిరువారూర్ నుంచి డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరువారూర్ డీఎంకే అభ్యర్థి పూండి కలైవానన్, మన్నార్‌కుడి టీఆర్‌బీ రాజా, తిరుత్తురై పూండి సీపీఐ అభ్యర్థి మారిముత్తు, నన్నిలం ఎస్‌డీపీఐ అభ్యర్థి నెల్‌లై ముబారక్‌లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానికంగా వారి సేవలను గుర్తు చేశారు. తిరువారూర్ అంటే డీఎంకే ఊరు అని వ్యాఖ్యలు చేస్తూ, తమ ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమాలను వివరించారు.


