వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని మహావీర్ జయంతి పురస్కరించుకొని వేలూరు బీఎస్‌ఎస్ ఆలయ వీధిలోని జైన్ సంఘానికి చెందిన భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జైన్ మతస్తులు స్వామి వారిని వాహనంలో ఉంచి మేళ తాళాల నడుమ నృత్యం చేస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ సమయంలో జైన్ మతానికి చెందిన వ్యాపారులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారికి పుష్పాభిషేకం చేసి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా గాంధీ రోడ్డులోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు స్వీట్లు పంచి పెట్టారు. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో పీఠంలోని భగవాన్ మహావీర్ సన్నధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధన నిర్వహించారు.


