నార్డ్ 6 ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: యువ నిపుణులు, టెక్ ప్రియుల కోసం వన్‌ప్లస్ తన ప్రతిష్టాత్మక ‘నార్డ్’ సిరీస్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6ను పరిచయం చేసింది. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, అధునాతన ఏఐ ఉత్పాదకత సాధనాలు, అత్యున్నతస్థాయి మన్నిక ఈ ఫోన్ ప్రత్యేకతలుగా మంగళవారం స్థానికంగా ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ విభాగంలోనే అతిపెద్దదైన 9వేల ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచామన్నారు. వన్‌ప్లస్ నార్డ్ 6 స్పెసిఫికేషన్లు, ధర, విక్రయాలకు సంబంధించిన ఇతర వివరాలు ఏప్రిల్ 7న అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో
ఏర్పాట్లు ముమ్మరం
వేలూరు: వేలూరు తొర్రపాడిలోని తందైపెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో వేలూరు జిల్లాలోని వేలూరు, కాట్పాడి, అనకట్టు, గుడియాత్తం, కేవీ కుప్పం నియోజక వర్గాలకు చెందిన ఈవీఎంలను భద్రపరిచి కౌంటింగ్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన బందోబస్తును ఎస్పీ శివరామన్, పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనఖీ చేశారు. ఎస్పీ శివరామన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లోని ప్రతి కౌంటింగ్ కేంద్రాల్లోనూ 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలోని వేలూరు, అనకట్టు, కాట్పాడి వంటి నియోజక వర్గాల్లోని కౌంటింగ్ కేంద్రాల్లోనూ 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈవీ ఎం మిషన్‌లు ఉంచే గదుల వద్ద నిఘా కెమె రాలు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రజలు ఎటువంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో
25 శాతం ఉచిత సీట్లు
– ఏప్రిల్ 20 నుంచి ఆన్ లైన్‌లో
దరఖాస్తులు
సాక్షి, చైన్నె: విద్యా హక్కు చట్టం మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన 25 శాతం రిజర్వేషన్ కోటా ప్రవేశాల కోసం ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. ఏప్రి ల్ 2న పాఠశాలలు తమ వద్ద ఉన్న మొత్తం సీట్లు, 25వాతం కోటా కింద అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 7న ప్రతి పాఠశాల తన నోటీసు బోర్డులో, విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కేటాయించిన సీట్ల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖా స్తు చేసుకోవడానికి గడువు కేటాయించారు. మే 20న దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన, అనర్హులైన వారి జాబితాను (కారణాలు సహా) నోటీసు బోర్డులో ఉంచాలని ఆదేశించారు. మే 22న ఒకవేళ దరఖాస్తులు సీట్ల కంటే ఎక్కువగా ఉంటే, లాటరీ పద్ధతి ద్వారా విద్యా ర్థులను ఎంపిక చేయాలని, అదే రోజున ఎంపికై న వారి జాబితా, వెయిటింగ్ లిస్ట్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. మే 25– 27వరకు ఎంపికై న విద్యార్థుల అడ్మిషన్లు నిర్వహించాలని సూచించారు.
30 మంది
విద్యార్థినులకు అస్వస్థత
తిరువొత్తియూరు: నామక్కల్, మోహనూర్ రోడ్డులో ఉన్న ఆదిద్రావిడర్ సంక్షేమ శాఖ ప్రభుత్వ మహిళా వసతి గృహంలో చదువుకుంటున్న 30 మంది విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యం కలిగింది. బాధితులైన విద్యార్థినులందరూ నామక్కల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వసతి గృహంలో నామక్కల్ ప్రభుత్వ మహిళా ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి ప్లస్‌టూ వరకు చదువుతున్న విద్యార్థినులు ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్నత తరగతులకు పరీక్షలు ముగియడంతో, 6 నుండి 9వ తరగతి వరకు చదువుతున్న 56 మంది విద్యార్థినులు మాత్రమే వసతి గృహంలో ఉన్నారు. వీరిలో ఎక్కువమంది కొల్లిమలై ప్రాంతానికి చెందినవారు. సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులకు అన్నం, క్యాబేజీ కూర, గుమ్మడికాయ సాంబార్‌తో భోజనం ఇచ్చారు. ఇది తిన్న కొద్దిసేపటికే 30 మంది విద్యార్థినులకు వరుసగా వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీని గురించి సమాచారం మేరకు ఆహార భద్రత అధికారి తంగ విఘ్నేష్ నేతృత్వంలోని బృందం వసతిగృహానికి నేరుగా వెళ్లి తనిఖీ చేసింది. అక్కడ ఉన్న సాంబార్, అన్నం తదితర ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షకు పంపారు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే విద్యార్థినులు మూర్ఛపోవడానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది.


