తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గ డీఎంకే అభ్యర్థిగా వీజీ రాజేంద్రన్‌ను ప్రకటించడాన్ని నిరసిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు డీఎంకే నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ నేతృత్వంలో పార్టీలో చేరారు. తిరువళ్లూరు మున్సిపాలిటీకి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అరుణ, డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జైకృష్ణ, నగర యువజన విభాగం ఆర్గనైజింగ్ ఉప కార్యదర్శి దిలీప్‌కుమార్, ఐటి వింగ్ జిల్లా ఉపకార్యదర్శి శరత్‌కుమార్, మనోజ్, సునిల్‌కుమార్ ఆపార్టీకి రాజీనామ చేసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీలో చేరిన డీఎంకే నేతలకు కండువా కప్పి మాజీ మంత్రి రమణ ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని, పార్టీలో సముచిత స్థానం దక్కేలా చర్యలు తీసుకుంటామని రమణ వారికి హామీ ఇచ్చారు. నగర కార్యదర్శి కందస్వామి, యూనియన్ కార్యదర్శి మాధవన్, అమ్మపేరవై జిల్లా కార్యదర్శి ఎయిలరసన్, విధ్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ బీవీ బాలాజీ, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ పట్ర సత్యమూర్తి, పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.


