నిర్మాణాంతర కార్యక్రమాల్లో ‘కుదిరె కొంబు’ | - | Sakshi
Sakshi News home page

నిర్మాణాంతర కార్యక్రమాల్లో ‘కుదిరె కొంబు’

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

తమిళసినిమా: శ్రీలంకలో యుద్ధం, ఆ తరువాత పరిణామాలతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. అదే కోవలో తెరకెక్కిన తాజా చిత్రం బొమ్మై. మహిళా దర్శకురాలు నవయుగ కుహరాజ తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐబీసీ తమిళ్‌ పతాకంపై బాస్కరన్‌ కండియా నిర్మించారు. ఇందులో నవయుగ కుహరాజా ప్రధాన పాత్రను పొషించిన ఇందులో శ్రీలంకలోని ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. యుద్దంలో పోరాడిన ఒక వీరవనిత అనంతరం ఎదుర్కొనే సమస్యల ఇతి వృత్తంగా రూపొందిన చిత్రం బొమ్మై. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి దర్శకురాలు పేర్కొంటూ తన చుట్టు పక్కలవారు, స్నేహితులు, బంధువుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. కాగా ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిందని యూనిట్‌ వర్గాలు తెలిపారు. ముఖ్యంగా స్వీడన్‌లో 2025లో జరిగిన లూలియా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో, బోడెన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నూతన దర్శకురాలు అవార్డును గెలుచుకుంది. అదేవిధంగా ఈజిప్ట్‌ అమెరికన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాలు, యోరా అంతర్జాతీయ చిత్రోత్సవాల అవార్డులకు బొమ్మై చిత్రం అధికారికంగా ఎంపికై ంది. కాగా ఎం.రజనీకాంత్‌ సంగీతాన్ని అందించిగా, సీనియర్‌ ఎడిటర్‌ లెనిన్‌ పని చేసిన ఈ చిత్రం త్వరలో తమిళనాడులో విడుదలకు సిద్ధమవుతోంది.

బొమ్మై

చిత్రంలో నటి నవయుగ కుహరాజా

తమిళసినిమా: కధలను మాత్రమే నమ్మి నిర్మించే చిత్రాల సంఖ్య ఇటీవల అధికమవుతోంది. అందులోనూ మంచి కంటెంట్‌తో రూపొందుతున్న చిన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. అలా మంచి సందేశంతో విభిన్న కథా, కథనాలతో రూపొందుతున్న తాజా చిత్రం కుదిరైకొంబు. యాపిల్‌ మూవీస్‌, యాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రమేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థల అధినేతలు గొమతి అయ్యనార్‌,యాస్‌, ఆర్‌. రమేష్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయ్యనార్‌ కృష్ణ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడంతో పాటూ ఒక కీలక పాత్రను పోషించడం విశేషం. ఇల్లియాస్‌, రామ్‌రాజ్‌,రమేశ్‌ ,ప్రవీణ్‌,చౌకత్‌అలీ, సానాశ్రీ,దుర్గ,లావణ్య, వేల్‌రాజ్‌, మమ్ముట్టి శింగారవేలన్‌, షణ్ముగం,రవి, శేఖర్‌,శరవణన్‌,గణేశ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చౌకత్‌అలీ సంగీతాన్ని, ఏఎస్‌.రాజ్‌, జయకుమార్‌ల ద్వయం ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. చిత్ర వివరాలను తెలుపుతూ అందని దాని కోసం ఆశపడితే ఎదురైయ్యే పరిణామాలు, తెలియకుండా చేసే తప్పుల వల్ల ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుందీ? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని పేర్కొన్నారు.చిత్ర షూటింగ్‌ను పేలం, ఏర్కాడు ,పాల్కాడు ప్రాంతాల్లో 55 రోజుల పాటు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రంలో మూడు పాటలు, మూడు పోరాట దృశ్యాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ,త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement