వేలూరు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీ చేసినా డీఎంకే పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గంలో డీఎంకే అభ్యర్థిగా దురై మురుగన్‌ను ప్రకటించారు. దీంతో మొదటిసారిగా ఆయన చైన్నె నుంచి రైలు మార్గంలో సోమవారం ఉదయం కాట్పాడికి చేరుకున్నారు. దీంతో కార్యకర్తలు అధిక సంఖ్యలో కాట్పాడి రైల్యే స్టేషన్‌కు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కాట్పాడి నుంచి తన మొదటి ప్రచారాన్ని ప్రారంభించారు. ర్యాలీగా వచ్చి అన్నాదురై, కామరాజర్, పెరియార్, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు కాట్పాడి నియోజక వర్గంలో 11 సార్లు, మిగిలిన నియోజక వర్గంలో రెండు సార్లు మొత్తం 13వ సారి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు.


