వేలూరు: వేలూరు జిల్లాలో వందశాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగా వేలూరు డీకేఎం మహిళా డిగ్రీ కళాశాలలో వందశాతం పోలింగ్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో అంగన్‌వాడీ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వందశాతం పోలింగ్ అనే అక్షరాలపై నిలబడి విద్యార్థినులు ఆకట్టుకున్నారు. అదే విధంగా బుడబుడకల వారి ద్వారా జక్కమ్మ చెపుతుంది, జక్కమ్మ చెపుతుందని మంచి రోజులు వస్తున్నాయని ఏఫ్రిల్ 23వ తేదీన ప్రతి ఓటు హక్కును వినియోగించుకోవాలని మొదటి సారి ఓటు హక్కు కలిగిన వారు తప్పక ఓటు వేయాలని కోరారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని గాందీ విగ్రహం నుంచి అంగన్‌వాడీలో ర్యాలీగా కోట మైదానంలోనికి వచ్చి వందశాతం పోలింగ్ అనే సంఖ్యపై నిలిచి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సహకరిస్తామని అంగన్‌వాడీలు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, అంగన్‌వాడీ వర్కర్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.


