తమిళసినిమా: రాష్ట్రంలో ఎన్నికల అడావుడి మొదలయ్యింది. ప్రచారానికి సిద్ధం అవుతూ విజయం కోసం వ్యూహరచనలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో టీఎన్ 2026 పేరుతో ఒక చిత్రం తెరపైకి రానుంది. ఏప్రిల్ 10న తెరపైకి రానున్న ఈ చిత్రంలో నట్టి కథానాయకుడిగా నటించారు. సిరుతారావ్, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఇందులో తంబిరామయ్య, ఎంఎస్.ఽబాస్కర్, ఇళవరసు, రెడిన్ కింగ్స్‌లీ, లొల్లుసభ మారన్, ముత్తుకుమార్, ఆదిత్యఖదీర్, చిత్రాలక్ష్మణన్, తలైవాసల్ విజయ్,వైయాపురి, వడివుక్కరసి, వీజీ చంద్రశేఖర్,శ్రీజరవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా డాన్స్‌మాస్టర్ శాండి క్యామియో పాత్రను పోషించిన ఈ చిత్రానికి తంబిరామయ్య కథను అందించగా ఆయన వారసుడు, నటుడు ఉమాపతి రామయ్య కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కేఆర్‌జీ.రవి గ్రూప్ పతాకంపై కన్నన్ రవి, దీపక్ రవి నిర్మించిన ఈ చిత్రానికి దర్బక శివ సంగీతాన్ని, పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 వ తేదీన తెరపైకి రానుంది. ఇది సమకాలీన రాజకీయ నేపధ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్శంగా చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటుడు నట్టి రాజకీయ వేదికపై ఆవేశంగా మాట్లాడుతూ పిడికిలి భిగించగా ఆయన చుట్టు ప్రచారంలో పాల్గొన కార్యకర్తలు, అభిమానుల దృశ్యం కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
శ్రీలంక యుద్ధానంతర
పరిణామాలతో బొమ్మై


