తమిళసినిమా: ఇటీవల సిరై చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ అధినేత ఎస్‌ఎస్.లలిత్‌కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం రావడి. కాగా దీనికి ఎల్‌కే విష్ణుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సిరై చిత్రంతో పరిచయం అయిన ఎల్‌కే అక్షయ్‌కుమార్, ఫాజిల్ జోసప్ ప్రధాన పాత్ర లు పోషిస్తున్న ఇందులో జాన్‌విజయ్, సత్యన్, జాఫర్ సాధిక్, నోబల్ కే.జేమ్స్, ఆరుణాచలేశ్వరన్. పీఏ, షారిక్ హాసన్,ఐశ్వర్య శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్ వడివేలు దర్శకుడిగా పరి చయం అవుతున్నారు. లియోన్ బ్రిట్టో ఛాయాగ్రహణంను, జన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్రం కామెడీ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నా రు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, ఓగెనగల్ ప్రాంతాల్లోని అందమైన ప్రకృతిలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని, రావడి చిత్రం కచ్చితంగా పేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


