సాక్షి, చైన్నె: నగరంలోని కిల్‌పాక్కం ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన మాహి హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి వైద్య ప్రమా ణాలను, రోగులపై ప్రత్యేక శ్రద్ధ తో అందించాలనే లక్ష్యంతో ఈ మల్టీ–స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. జిటో చైర్మన్ రాజేష్ జీ చందన్, భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్, పారిశ్రామిక వేత్త సుగల్ జీ సింఘ్వీ, ప్యారేలాల్ జీ పితాలియాలు ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.
మాహి హాస్పిటల్స్‌ను ప్రఖ్యాత వైద్య దంపతులు డాక్టర్ దీపికా లునావ త్, డాక్టర్ విజయ్ సోహన్ లాల్ ఎస్ స్థా పించారు. డాక్టర్ విజయ్ సోహన్ లాల్ ఎస్ ప్రముఖ సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆర్థోపెడిక్ సర్జన్‌గా 18 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్నారు.డాక్టర్ దీపి కా లునావత్ ప్రముఖ డెర్మటాలజిస్ట్ ఈస్తటిక్ స్పెషలిస్ట్, చర్మ సంబంధిత చికిత్సలలో ప్రత్యేక గుర్తింపుపొంది ఉన్నా రు. చైన్నెలోని ప్రధాన ప్రాంతంలో ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగుల కు సులభంగా అందుబాటులో తమ ఆస్పత్రి ఉంటుందని పేర్కొన్నారు.


