విజయపు కూటమి | - | Sakshi
Sakshi News home page

విజయపు కూటమి

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

విజయపు కూటమి ●మిత్రులకు స్టాలిన్‌ విందు

●మిత్రులకు స్టాలిన్‌ విందు

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందుగా మిత్ర పక్షాల నేతలతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ సమావేశమయ్యారు. వారికి తేనీటి విందు ఇచ్చారు. ఇది గెలుపు కూటమి అని, విజయంతో మళ్లీ కలుద్దామని వారికి సూచించారు. అన్నా అరివాలయంలో జరిగిన ఈ సమావేశానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్‌, సీపీఎం నేత షణ్ముగం, సీపీఐ నేత వీర పాండియన్‌, మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌తో పాటుగా ముఖ్యనేతలందరూ హాజరయ్యారు. మంగళవారం నుంచి స్టాలిన్‌ ప్రచారంలో బీజీ కానున్నారు. తిరువారూర్‌నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. దీంతో కూటమి పార్టీలతో ఎన్నికల వ్యూహాల గురించి చర్చించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కూటమిలోని కీలక నేతల ప్రచార అంశాల గురించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, డిప్యూటీ సీఎం, యువజన నేత ఉదయ నిధి స్టాలిన్‌ సోమవారం కాంచీపురం వేదికగా తమ అభ్యర్థి నిత్య సుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంతో శ్రీకారం చుట్టారు. కాగా ముందుగా సీపీఎంకు కేటాయించిన పద్మనాభపురంను కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌కు కేటాయించిన విలవన్‌ కోడ్‌ స్థానాన్ని మార్చుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్‌ జాబితా విడుదలలో జాప్యం గురించిన చర్చ సాగినట్టు సమాచారం. ఇక మిత్రపక్షాల అభ్యర్థులు, నేతలు స్టాలిన్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇదిలా ఉండగా తమిళనాడులో అధిక సీట్లు రాబట్టుకునే సత్తా ఇక్కడి కాంగ్రెస్‌ నేతలకు లేదంటూ ఏఐసీసీ నేత ప్రవీణ్‌ చక్రవర్తి తాజాగా వ్యాఖ్యానించడం హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement