కొరుక్కుపేట: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనన్స్ అండ్ టెక్నాలజీ –వడపళని క్యాంపస్‌ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో అధునాతన పరిశోధనపై అంతర్జాతీయ సదస్సు (ఐసీఏఆర్‌ఈసీఎస్ –2026 )ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో అభివద్ధి చెందుతున్న పోకడలు, ఆవిష్కరణలపై చర్చించడానికి విద్యావేత్తలు, పరిశోధకులు పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్సీ) శాస్త్రవేత్త ఇంజినీర్ – ఎస్జి (రిటైర్డ్) డాక్టర్ ఎల్. శ్రీనివాసన్ పాల్గొని సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రపంచ పరిశోధన సహకారాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ సదస్సు ప్రొసీడింగ్స్‌ను ప్రముఖులు విడుదల చేశారు. అంతేకాకుండా, డాక్టర్ రాజా రామ్మోహన్ రాయ్ ఏజెన్సీ ఫర్ ఐఎస్‌బిఎన్ పబ్లికేషన్ స్కీమ్ కింద ఈ ప్రొసీడింగ్స్ ఐఎస్‌బీఎస్‌తో ప్రచురించారు. ప్రారంభోత్సవం అనంతరం, మలేషియాలోని టేలర్స్ విశ్వవిద్యాలయం, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫిజాన్ బిన్ అజ్మాన్ కీలకోపన్యాసాలు చేశారు. అనంతరం ఇసిఇ విభాగాధిపతి (హెచ్‌ఓడి) డా. ఎ. షిర్లీ ఎడ్వర్డ్ స్వాగతోపన్యాసం చేయగా, ఇసిఇ అసోసియేట్ ప్రొఫెసర్ డా. పి. నాగరాజన్ సదస్సుకు అద్భుతమైన స్పందన లభించిందని, దీనికి 450కి పైగా పరిశోధనా పత్రాలు అందాయని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. డీన్ డాక్టర్ సి వి జయకుమార్ , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి గోమతి ,డాక్టర్ చెగ్గౌర్ సెలీనా, డాక్టర్ ఎస్ వెంకటేష్, డాక్టర్ పి నాగరాజన్, డాక్టర్ అంజు పాల్గొన్నారు.


